![]() |
![]() |

వినాయక చవితి స్పెషల్ షోగా ఓం గణేష్ పేరుతో ఒక స్పెషల్ షో రాబోతోంది. ఏ ఫెస్టివల్ ఐనా దానికి తగ్గట్టు ప్రోగ్రామ్స్ ని, షోస్ ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా ఈ షోని అలాగే డిజైన్ చేసారు. ఇక సుధీర్ ని హోస్ట్ గా పెట్టారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోలో చాలామంది కనిపించారు. ఇక నాగబాబు ఐతే మాములుగా జోక్స్ వేయలేదు. ఈ షోకి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. బ్రహ్మాజీ కూడా వచ్చారు. రావడమే "అన్నయ్య చిన్న ప్రోబ్లం వచ్చింది" అని చెప్పేసరికి..."చూడు బ్రహ్మాజీ వయసులో ఉన్న సుధీర్ కె ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు రావడం పెద్ద విషయమే కాదు" అని చెప్పేసరికి సుధీర్ షాకై తెల్లమొహం వేసాడు.

ఈ షో ముందు లీడ్ గా సుధీర్ "ప్రతీ పండక్కి ఒక ఈవెంట్ ఉంటుంది. కానీ ఈ ఈవెంట్ ఒక పండగల ఉంటుంది" అని చెప్పాడు. ఇక ఈ షోకి నారా రోహిత్, తేజ సజ్జ, డైరెక్టర్ క్రిష్, డాన్సర్ పండు, మానస్, కావ్యశ్రీ, సింగర్ రోహిత్ , సండ్ర,మహేష్, జబర్దస్త్ కమెడియన్స్, హైపర్ ఆది వచ్చారు. ఈ షోకి సుందరకాండ మూవీ టీమ్ వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈ మంత్ ఎండింగ్ కి ఈ మూవీ రిలీజ్ కాబుతోంది. ఇక హోస్ట్ సుధీర్ కావడంతో నెటిజన్స్ అంత ఫుల్ ఖుషిలో ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ సుధీర్.. చాలా బాగుంది నాగబాబు సార్ మళ్లీ రావడం చాలా హ్యాపీగా ఉంది దద్దరిల్లిపోవాలి గణేష్ ప్రోగ్రాం మళ్లీ ప్రదీప్ ఈటీవీలోకి వస్తే చాలా బాగుంటుంది...జై సుధీర్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |